పోలీసుల అదుపులో సిమ్స్ డైరెక్టర్
విశాఖపట్నం : సిమ్స్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని ఫోర్త్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస రెడ్డి రెండు నెలలుగా పరారీలో ఉన్నాడు. ఆయన యానాంలో తలదాచుకున్నట్లు సమాచారం. మనీ సర్క్యులేషన్ పేరుతో సిమ్స్ సంస్థ ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే.


