పోలీసు భద్రతతో నడుస్తున్న ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్‌ : బంద్‌ సందర్భంగా ఎంజీబీఎస్‌ డిపో వద్ద పోలీసుల భద్రత మధ్య బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ చందర్‌ తెలిపారు. 557 బస్సులకు గానూ 309 బస్సులు మాత్రమే నడుపుతున్నట్లు ఆయన చెప్పారు. 787 బస్సులు జిల్లాల నుంచి రావాల్సి ఉండగా 419 మాత్రమే చేరుకున్నాయని చందర్‌ తెలిపారు.