పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ : నగరంలోని బషీర్‌బాగ్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలిని నారాయణగూడ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.