పౌరసరఫరాలపై సచివాలయంలో తులసిరెడ్డి సమీక్ష

హైదరాబాద్‌: పౌరసరఫరాల శఖపై 20 సూత్రాల పథకం ఛైర్మన్‌ ఎస్‌.తులసిరెడ్డి బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల కమిషనర్‌ మర్‌ప్రీత్‌సింగ్‌, డైరెక్టర్‌ చిరంజీవులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం తులసిరెడ్డి విలేరులతో మాట్లాడారు. 43,129 చౌకధరల దుకాణాల ద్వారా రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 2.21 కోట్ల కుటుంబాలకు బియ్యం, గోధుమాలు, పంచదార సరఫరా జరుగుతోందన్నారు. 2012-13 ఆర్ధిక ఏడాదికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 268 గ్రామీణ ధాన్యం బ్యాంకులను మంజూరు చేసిందని చెప్పారు.