ప్రజలతో మమేకమవ్వండి

share on facebook

– నూతన కార్పొరేటర్లకు కేటీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌,డిసెంబరు 6(జనంసాక్షి):గ్రేటర్‌ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన తెరాస కార్పొరేటర్లతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి ఇటీవల గెలిచిన 55 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. కార్పొరేటర్ల పనితీరు, రానున్న ఐదేళ్లలో ప్రజలతో ఎలా మెలగాలనే అంశాలపై కేటీఆర్‌ వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేసి తెరాసపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని కార్పొరేటర్లను కోరారు. మేయర్‌ ఎంపిక విషయంలో అవలంబించాల్సిన వైఖరిపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద కేటీఆర్‌ నివాళులర్పించారు. ఈ సమావేశంలో నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Other News

Comments are closed.