ప్రజలను దోపిడీ చేసేందుకే విద్యుత్తు ఛార్జీల పెంపు
హైదరాబాద్: సర్‌ఛార్జీలతో కలిపి పెరిగిన విద్యుత్తు ఛార్జీలు సామాన్యులను భయపెడుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. ప్రభుత్వం విద్యుత్తు రంగాన్ని ప్రజలను దోపిడీ చేసేందుకే వాడుకుంటోందని ఆయన విమర్శించారు. వచ్చే ఏడాదికల్లా ప్రజలపై రూ.12వేల కోట్ల ఛార్జీల భారం మోపాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. పెంచిన విద్యుత్తు ఛార్జీలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే వామపక్షాల తరపున రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉద్యమం తెస్తామని హెచ్చరించారు.



