ప్రజలను మోసగించే పథకాలు రద్దు చేయాలి

ప్రధానమంత్రి మాజీ కార్యదర్శి వేణుగోపాల్‌ రెడ్డి
కర్నూలు : దేశంలో అమలవుతున్న పథకాలను సక్రమంగా అమలు చేస్తే కొత్త పథకాలు అవసరం లేదని ప్రధానమంత్రి మాజీ కార్యదర్శి ఆర్‌. వేణుగోపాల్‌ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన ‘ఆహార భద్రత – నగదు బదిలీ నథకం’పై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ… దేశంలో ఆహార భద్రత లేనికారణంగా చాలా మంది మృత్యువాత పడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జిమ్మిక్కులు చేయడానికే నగదు బదిలీపథకం పెట్టారని ఎద్దేవాచేశారు. నగదు బదిలీ పథకం వల్ల దేశానికి పెద్ద ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. ఒప్పటికైనా ప్రభుత్వాలు ప్రజలను మోసగించే పథకాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.