ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మధుయాష్కీపూ కేసు పెట్టాలి: దాడి వీరభద్రరావు

హైదరాబాద్‌: ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మధుయాష్కీపై రాజద్రోహం కేసు పెట్టాలని శాసనమండలి ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు తమ వీరత్వాన్ని సోనియా వద్ద ఢిల్లీలోనూ ప్రదర్శించాలే కానీ సీమాంధ్ర ప్రజలపై కాదని అన్నారు. కవాతును అడ్డుకునేవారిని అనుమతులు ఇవ్వనివారిని ప్రశ్నించాలని సూచించారు. తెలంగాణా మార్చ్‌ను సీమాంధ్ర ప్రజలు అడ్డుకుంటున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇంతలా దిగజారి ప్రవర్తించొద్దని కోదండరాంకు హితవు పలికారు. ఈ తరహా ప్రకటనల వల్లే తెలంగాణా ఉద్యమానికి సీమాంధ్రుల సానుభూతి లేకుండా చేసుకుంటున్నారన్నారు. కవాతులో ఎలాంటి విధ్వంసాలు జరిగినా దానికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు.