ప్రజల్లో చైతన్యం కోసమే దీక్ష : జేపీ

హైదరాబాద్‌: ప్రజల్లో  ఆలోచన, చైతన్య కోసమే దీక్ష చేపట్టినట్లు లోక్‌సత్తా అధినేత జేపీ తెలియజేశారు. ఇందిరాపార్క్‌ వద్ద మూడు రోజుల సురాజ్య దీక్షను జేపీ ప్రారంభించి మాట్టాడారు. ఏ చిన్న పనికోసం ప్రభుత్వం కార్యాలయాలకు వెళ్లినా లంచం అడుగుతున్నారని అన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకం కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలాతిరగాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. గడువులోగా పనులు చేయకపోతే ప్రభుత్వ అధికారులు అపరాధ రుసుం చెల్లించేలా చట్టం చేయాలని కోరారు.