ప్రజల దృష్టి మరల్చేందుకే అవిశ్వాసం: చీఫ్‌వివ్‌ గండ్ర

హైదరాబాద్‌: తెదేపా, వైకాపాలు ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వ చీఫ్‌వివ్‌ గండ్ర వెంకటరమణ అన్నారు. అధికారం కోసం కొడుకుపై ఉన్న ఆరోపణలనుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అవిశ్వాసం పెట్టాలని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇందిరమ్మబాట మొదలు పెట్టగానే చంద్రబాబు యాత్ర ప్రారంభించారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతోందని అన్నారు. షర్మిళ పాదయాత్రలో జగన్‌పై అవినీతి ఆరోపణలకు స్పష్టత నివ్లాన్నారు. రాజకీయ ఉనికి కోసమే యాత్రలు చేపడుతున్నారని విమర్శలు గుప్పించారు.