ప్రజాభిప్రాయ సేకరణలో మోర్సీ వైపే మొగ్గు

కైరో: ఈజిప్టులో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అధ్యక్షుడు మోర్సీకి అనుకూలంగా ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడికి విశేష అధికారాలు వెల్లడించారు. అధ్యక్షుడికి విశేష అధికారాలు కల్పించే రాజ్యాంగ సవరణపై రెండు దఫాలుగా ప్రజాభిప్రయా సేకరణ నిర్వహించారు. 17 ప్రాంతాల్లో శనివారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రాథమిక ఫలితాలను ఆదివారం ఉదయం వెల్లడించారు. ఇందులో 95.5 శాతం ఓటింగ్‌ నమోదు కాగా.. 71.4 శాతం అధ్యక్షుడికి అనుకూలంగా ఉన్నట్లు తేలింది. తొలి దశ ప్రజాభిప్రాయంలో 56 శాతం మంది కొత్త రాజ్యాంగానికి  మద్దతు తెలిపారు. అధ్యక్షుడి కొత్త రాజ్యంగాన్ని వ్యతిరేకిస్తూ గత నెల రోజుల నుంచి ఈజిప్టులో ఆందోళనలు ఉద్థృతమవుతున్న సంగతి తెలిసిందే.