ప్రజాభీష్టం మేరకే జగన్‌ పార్టీలో చేరిక: అమర్‌నాథ్‌రెడ్డి

చంచల్‌గూడ: పార్టీ వ్యతిరేక విధానాలతో పార్టీని వీడుతున్నట్లు పలమనేరు నియోజకవర్గం శాసనసభ్యుడు అమర్‌నాధ్‌రెడ్డి అన్నారు. చంచల్‌గూడ జైల్లో జగన్‌ను కలిసిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల తెదేపా తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాలే తనను జగన్‌ పార్టీలో చేరడానికి ప్రేరేపించాయన్నారు. నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు జగన్‌ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.