ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు : పయ్యావుల

హైదరాబాద్‌ : శాసనసభ సమావేశాల నిర్వహణ, ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. అన్ని పార్టీల శాసనసభ పక్ష నేతలను సమన్వయ పరచటంలో స్పీకర్‌ విఫలమవుతున్నారుని ఆయన విమర్శించారు. గుర్నాథ్‌ రెడ్డి తనపై చేసిన ఆరోపణలకు తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని తానే ప్రభుత్వానికి లేఖ రాస్తానని పయ్యావుల అన్నారు. అవిశ్వాసంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిని గుర్నాథ్‌రెడ్డికి సర్కార్‌ విచారణపై విచారణ జరిపించాలని తానే ప్రభుత్వానికి లేఖ రాస్తానని పయ్యావుల అన్నారు. అవిశ్వాసంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన గుర్నాథ్‌రెడ్డికి సర్కార్‌ విచారణపై నమ్మకం లేకుంటే కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేయటానికి కూడా సిద్ధమని ఆయన అన్నారు. ఒక హోటల్‌లో జరిగిని శుభకార్యంలో గాలి జనార్థనరెడ్డి తనకు తారసపడినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం పెడితే గుర్నాథ్‌రెడ్డి దాన్ని భూతద్దంలో చూపుతూ అసత్య ఆరోపణలకు దుయ్యబట్టారు.