ప్రతి మండలంలో మూడు ఆధార్‌ కేంద్రాలు

ఇంటింటికి ఇంటర్నెట్‌ సేవలు

శాసన మండలిలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని ప్రతి మండలంలో మూడు ఆధార్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గురువారం మండలి సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. ఆధార్‌ కేంద్రాలు, ఇంటర్నెట్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలు, నిజామాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీపై జరిగిన చర్చపై మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 709 ఆధార్‌ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్త ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్‌ ఆధార్‌ సెంటర్లను ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చుతామన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ సహా ఆరు కార్పొరేషన్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఆరు కార్పొరేషన్లలో ప్రణాళికబద్దమైన అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఆధార్‌ అనుసంధానంగానే ఫించన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌ లో చేపట్టబోయే పథకాలు కూడా ఆధార్‌ లింక్‌ చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. రాష్ట్రంలో ఇంటర్నెట్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవల్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే ఇంటింటికి ఇంటర్నెట్‌ సేవలు వినూత్న కార్యక్రమన్నారు. వైద్యం, ఆరోగ్యం, విద్యకు ఇంటర్నెట్‌ సేవలు చాలా ఉపయోగకరమని చెప్పారు.