ప్రధాని నిజాయితీతో వ్యవహరించాలి: రాందేవ్‌

న్యూఢిల్లీ: అవినీతి నిర్మూలనలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిజాయితీతో  వ్యవహరించాలని బాబారాందేవ్‌ కోరారు. అవినీతికి వ్యతిరేకంగా రాంలీల మైదాన్‌లో బాబారాందేవ్‌  చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది, విదేశాల్లో ఉన్న నల్ల ధనం వెనక్కి తీసుకువస్తే.. దేశంలో ధరల పెరుగుల, ప్రజలపై పన్నుల భారం తగ్గుతుందని పేర్కొన్నారు. నల్లధనంతో దేశంలోని మావోయిస్టుల సమస్యను పరిష్కరించవచ్చని సూచించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని రాంలీల మైదాన్‌లో యువత జన్మాష్టమి వేడుకలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.