ప్రభుత్వం స్పందించకపోతే పాలన స్తంభింపచేస్తాం

హైదరాబాద్‌ : పదో వేతన సంఘం, కేసులు ఎత్తివే, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో పాలనను స్తంభింపచేస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు. జనవరిలోగా ఆరోగ్య కార్డులు ఇవ్వకపోతే చలో హైదరాబాద్‌ నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత విఠల్‌ పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే మరోసారి ఉద్యమం చేపడతామని శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.