ప్రభుత్వానికి జీవ వైవిధ్య సదస్సుపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: ప్రభుత్వానికి జీవ వైవిధ్య సరస్సుపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో డెంగీ బారిన పడి అనేక మంది మరణిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. లక్షలు వెచ్చించలేని ప్రజలు డెంగీ బారిన పడుతుంటే అధికారులంతా మాదాపూర్‌లో ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలిత రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడే నైతిక అర్హత సోనియా గాంధికి లేదన్నారు. జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ప్రధానికి నిరసన తెలపాలన్న జేఏసీ కార్యక్రమానికి తాము వ్యతిరేకమని అన్నారు.



