ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలి
-కలెక్టర్ డాక్టర్ ఎ శరత్
జగిత్యాల,నవంబర్16(జనంసాక్షి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు.స్థానిక ఐఎంఎ హాల్లో ఆరోగ్య స్త్రీశిశుసంక్షేమ శాఖల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 9 నెలలు నిండిన గర్బిణీలు గుర్తించి వారు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహారం తీసుకుంటున్నారా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకున్నది చూడాలన్నారు. ఆకు కూరలు పౌష్టికాహారంపై వారికి అవగాహన కల్పించాలన్నారు. అంగన్‌వాడీ వర్కర్లు ఆశావర్కర్లు హెల్పర్లు, హెల్త్ సూపర్‌వైజర్లు ఎఎన్‌ఎంలు కలిసికట్టుగా ఈ దిశలో పనిచేయాలన్నారు.ఎఎన్‌ఎంలు వారం సోమ, బుద ఆది వారాలు గ్రామసందర్శన చేస్తారని వారు గ్రామ సందర్శనలు చేసినప్పుడు వారి ఆద్వర్యంలో ఆగ్రామంలో ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు, హెల్పర్లు, స్వయం సహాయక సంఘాలు, గ్రామైక్య సంఘాలతో సమావేశం నిర్వహించి ఆగ్రామంలోని గర్బిణీలను పౌష్టికాహరం తీసుకు నేలా సాదారణ ప్రసవాలు చేసుకునేలా అవగాహన చైతన్యం కల్పించాలన్నారు. ఆపరేషన్ కాన్పులతో వచ్చే నష్టాల గురించి వారికి వివ రించాలన్నారు. ఆపరేషన్ల వల్ల ఆర్థికంగా, శారీరకంగా ఎంతో నష్టమో అవగాహన కల్పించాలన్నారు. 70శాతం ప్రసవాలు ఖచ్చితంగా ప్రభుత్వాసుపత్రుల్లో జరగాలన్నారు.వెనుకబడిన వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ అన్నారు. సూపర్‌వైజర్లవారిగా ఏఇరియాలవారిగా ప్రస వాలపై నివేదిక సమర్పించాలన్నారు. సాదరణ ప్రసవాలను ప్రోత్సహించాలని ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం జరగాలని ఆరోగ్య వంతమైన సమాజంతోనే పనిచేసే శక్తి వస్తుందన్నారు. పనిచేసినప్పుడే ఆదాయం పెరుగుతుందని ఆదాయం పెరుగుదలతో అభివృద్ది వస్తుందన్నారు. 4500 కిపైగా సిబ్బంది ఉన్నట్లు సిబ్బంది అందరు తమ విద్యుక్త దర్మాన్ని సరిగ్గా నిర్వహిస్తే లక్ష్యం సాదించడంలో ఏ మాత్రం సందేహం లేదన్నారు. సమావేశంలో మెట్ పల్లి సబ్ కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖి, జిల్లా వైద్యాధికారిని డాక్టర్ సుగందిని, తదితరు లు పాల్గొన్నారు.



