ప్రమాదానికి గురైన మంత్రి నిరంజన్ రెడ్డి వాహనం

నారాయణపేట: జిల్లాలోని మక్తల్ మండలం జక్లేర్ వద్ద మంత్రి నిరంజన్ రెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది. నారాయణపేటలో కేటీఆర్ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మంత్రి కారును వరికోత మిషన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం నుంచి మంత్రి నిరంజన్ రెడ్డి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వేరే వాహనంలో కేటీఆర్‌ సభా ప్రాంగణానికి మంత్రి బయలుదేరి వెళ్లారు.