ప్రముఖ మలయాళ నటుడు తిలకన్‌ కన్నుమూత

 

తిరువనంతపురం ప్రముఖ మలయాళ నటుడు తిలకన్‌ (77) కన్నుమూశారు. గత నెల రోజులుగా అనారోగ్యంతో తిరువనంతపురంలోని ఒ అసుపత్రిలో చికిత్స పోందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. 1956 లో సినీ రంగంలోకి ప్రవేశించిన తిలకన్‌ 200 కు పైగా చిత్రాల్లో నటించారు. ఉత్తమ సహయ నటుడీగా జాతీయ అవార్డునుకూడా అందుకున్నారు. 1999లో భారత ప్రభుత్వం అయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తిలకన్‌ అంత్య క్రియలు ఈ సాయంత్రం నిర్వహించారు.