ప్రయాణాలు వాయిదా వేసుకుని సడక్‌బంద్‌కు సహకరించండి: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనందునే సడక్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస కన్వీనర్‌ కోదండరాం తెలిపారు. రేపు కొత్తూరు నుంచి అలంపూర్‌ వరకు భాజపా సడక్‌బంద్‌ ప్రచార యాత్ర ఉంటుందని అందరూ ప్రయాణాలే వాయిదా వేసుకుని సడక్‌బంద్‌కు సహకరించాలని ఆయన అన్నారు. సడక్‌బంద్‌ను తప్పనిసరిగా విజయవంతం చేస్తామన్నారు. అంబులెన్స్‌ లాంటి అత్యవసర విషయాల్లో మినహాయింపు ఉంటుందన్నారు. శంషాబాద్‌ నుంచి అలంపూర్‌ వరకు జాతీయ రహదారిపై 12 చోట్ల సడక్‌ బంద్‌ ఉంటుందని కోదండరాం పేర్కొన్నారు.

తాజావార్తలు