ప్రశాంతంగా ఉద్యమం చేసుకోవాలి: రాజనర్సింహ

హైదరాబాద్‌:  తెలంగాణ మార్చ్‌ సందర్భంగా ఆందోళనకారులు ప్రశాంతంగా ఉద్యమం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారులను నిర్బంధించడం తగదన్నారు. ఉద్యమం అహింసాయుతంగా సాగాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తంచేశారు.