ప్రస్తుతానికి పార్టీ వీడేది లేదు : కావూరి సాంబశివరావు

ఏలూరు: కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు ప్రస్తుతానికి పార్టీని వీడేది లేదని తెలియజేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆ పరిస్థితిని కల్పిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కోల్లేరు సమస్యపై పరిష్కరించకపోతే ఈ నెలాఖరునాటికి పోరాటం చేస్తానని హెచ్చరించారు. కొల్లేరును ఐదు నుంచి మూడో కాంటూరు వరకు కుదించాలని కోరారు.