ప్రాచీనకాలంనుంచి ఎస్సీల జీవితాల్లో ఎలాంటి మార్పులేదు: మంత్రి గీతారెడ్డి
హైదరాబాద్: ప్రాచీన కాలంనుంచి ఎస్సీల జీవితాల్లో ఎలాంటి మార్పులేదని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై విధానసభలో జరిగిన చర్చలో ఆమె పాల్గొంటూ ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన నిధులు వారికి దక్కాలని ఆమె పేర్కొన్నారు. ఉ ప్రణాళిక బిల్లు కోసం అణగారిని వర్గాలన్నీ అనాదిగా ఎదురుచూస్తున్నాయని ఆమె అన్నారు. నిధుల మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. పార్టీల కతీతంగా బిల్లుకు సభ్యులు మద్దతు తెలిపాలని గీతారెడ్డి అన్నారు.



