‘ప్రేమా గీమా జాంతానై’ చిత్రీకరణను అడ్డుకున్న విద్యార్థులు
విశాఖ : ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో ‘ప్రేమా గీమా జాంతానై’ సినిమా చిత్రీకరణను విద్యార్థులు అడ్దుకున్నారు. చిత్రీకరణకు అనుమతి ఇవ్వడం వల్ల తమ చదువులు పాడవుతున్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో చిత్ర యూనిట్ అక్కడి నుంచి వెనుదిరిగింది.