బంగాళాశాతంలో అల్పపీడన ద్రోణీ

విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంలో అక్కడక్కడ వర్షం పడే అవకాశముందని విశాకలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో దక్షిణాంధ్ర, రాయసీమల్లో వర్షలు పడనున్నట్టు తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశారు. గడిచిన 24 గంటల్లో శ్రీహరికోట, సత్యవేడుల్లో 1 సెంటీమీటరు వర్షపాతం నమోదైంది. తెలంగాణలో పొడివాతావరణం ఉంటుందని వారు పేర్కొన్నారు.