బంజారాహిల్స్‌లో కుటుంబం ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10లో ఓ కుటుంబం ఆత్మహత్యయత్నం చేసింది. స్థానికంగా నివసించే ఓ వ్యక్తి భార్య, కుమార్తెతో కలిసి విషం తాగాడు. ఈ ఘటనలో భార్య కుమార్తె మృతి చెందగా అతని పరిస్థితి విషమంగా ఉంది. ఆర్ధిక సమస్యలే  ఈ అఘాయిత్యానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.