బంటిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన బిలకంటి రాంరెడ్డి

 

ఇబ్రహీంపట్నం, మార్చ్12(జనంసాక్షి)
తెరాస యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ప్రగతి నివేదన యాత్ర ద్విగిజయంగా634కిలోమిటర్లు 50 రోజులు 85గ్రామాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నందివనపర్తి తెరాస సీనియర్ నాయకులు బిలకంటి రాం రెడ్డి మర్యాద పూర్వకంగా కలసి శాలువా తో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 22తేది-రోజున యాచారం మండలం నంది వనపర్తి గ్రామం లోని నందీశ్వర ఆలయం నుంచి ప్రారంభమైన ప్రగతి నివేదన యాత్ర నేటితో 50 రోజులు పూర్తిచేసుకోని.ప్రతి గ్రామం,ప్రతి గడపగడపకు, అనే నినాదంతో విజవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బిలకంటి రాం రెడ్డి హర్షం వ్యక్తం చేశారు అబ్దుల్లాపూర్మెట్ మండలం కొత్తగూడ గ్రామానికి చేరుకున్న ప్రగతి నివేదన యాత్ర నేటితో 634కిలోమీటర్లు 85 గ్రామాల మీదుగా పాదయాత్రతో కొనసాగించిన మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పాదయాత్ర లోపేద బడుగు బలహీన వర్గాల ప్రజల దీవెనలతోకష్ట సుఖాలు తెలుసుకోని తెలంగాణ ప్రభుత్వం ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను.పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలకు ఇంకా ఏమే మి అవసరం ఉన్నాయో తెలుసుకొని వాటి పరిష్కారం కోసం చేస్తున్న
ప్రగతి నివేదన యాత్ర అలుపెరగకుండా ఒక ప్రవాహం లాగా సాగుతు మును ముందుకు కొనసాగుతుందని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతిరిగి మరొసారి టిఆర్ఎస్ జేండా కైవసం చేసుకుంటుందని తెలిపారు