బస్సులో మహిళపై లైంగిక వేధింపులు

న్యూఢిల్లీ : దేశరాజధానిలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. వైద్య విద్యార్ధినిపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే అలాంటి ఘటనే మరోకటి చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఓ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయితే పోలీసులు వెంటనే స్పందించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై బస్సు డ్రైవర్‌, కండెక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.