బాక్సైట్‌ లీజులు రద్దు చేయాలని సీఎంకు కేంద్రమంత్రి లేఖ

ఢిల్లీ: విశాఖ బాక్సైట్‌ గనుల లీజులు రద్దు చేయాలని కేంద్రమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. లీజు ఇచ్చిన ప్రాంతం షెడ్యూల్‌ ఏరియాలో ఉన్నందునే రద్దు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ప్రతిపాదిత ప్రాంతంలో గనుల తవ్వకం వల్ల పర్వారణానికి నష్టం జరుగుతున్నందున రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.