బాణసంచా దుకాణల్లో ప్రమాదం

కడప: కడప జిల్లా పులివెందులలోని దీపావళి సందర్భంగా ఏర్పాటుచేసిన బాణసంచా దుకాణంలో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనావేస్తున్నారు.