బాణాసంచాపేలి ఇద్దరు దుర్మరణం

తూర్పుగోదావరి : బాణాసంచా పేలి ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటన రాయవరం మండలం కోమరిపాలెంలోని భవానీ బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకుంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.