బాణాసంచా పేలుడు వల్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: బాణాసంచా పేలుడు వల్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగిందని దక్షిణ మధ్య విభాగం రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్‌ఎన్) దినేష్‌కుమార్ సింగ్ వెల్లడించారు. న్యూఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ జులై 30న నెల్లూరు జిల్లాలో మంటల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 32 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 28 మంది గాయపడ్డారు. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో రైల్వే సిబ్బంది వైఫల్యం కూడా కనిపిస్తోందని దినేష్ కుమార్‌సింగ్ నివేదించారు.



