బాబు జగ్జీవన్ రాంకు సీఎం ఘన నివాళి
హైదరాబాద్ : భారత మాజీ ఉప ప్రధాని, దళిత నేత డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ 106వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జగజ్జీవన్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం అయన బషీర్‌బాగ్‌లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దానం నగేందర్, ఆనం రాంనారాయణరెడ్డి పాల్గొన్నారు.


