బాబు తలపెట్టిన ‘వస్తున్నా మీకోసం’ యాత్రకు మంద కృష్ణమాదిగ మద్దతు

హైదరాబాద్‌: చంద్రబాబు తలపెట్టిన ‘వస్తున్నా మీకోసం’ యాత్రకు ఎమ్మార్పీఎస్‌ వ్వవస్థాపక అధ్మక్షుడు మంద కృష్ణమాదిగ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ యాత్రకు మాదిగలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీవర్గీకరణ చేయకపోతే కాంగ్రెస్‌ పార్టీని మాదిగలు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.