బాబూ డొంక తిరుగుడు వద్దు

– ఒకే ప్రతనిధిని పంపు
– టీడీపీ కార్యాలయం ఎదుట తెలంగాణవాదుల ధర్నా
హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :తెలంగాణపై అఖి లపక్ష సమావేశం నిర్వహించాలంటూ కేంద్రానికి ఇప్పటికే లేఖ రాసిన చంద్రబాబు నాయుడు ఈనెల 28న నిర్వహించనున్న ఆల్‌ పార్టీ మీటింగ్‌లో ఒకే వైఖరి చెప్పాలని తెలంగాణవాదులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్రం లేఖలు రాశాక డొంకతిరుగుడు ప్రకటనలు చేస్తున్నారని, వాటిని కట్టిపెట్టి ఒకే వైఖరి ప్రకటించాలని కోరారు. వైఖరి చెప్పకుంటే చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆందోళన ఉధృతరూపం దాల్చడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.