బాబ్లీపై అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్టుపై సచివాలయంలో అఖిలక్షం గురువారం భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, మంత్రులు సుదర్శన్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య ఈ సమావేశానికి హాజరయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బాజిరెడ్డి గోవర్థన్, కేకే మహేందర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వర రావు, టీఆర్‌ఎస్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి, వినోద్‌కుమార్, విద్యాసాగర్‌రావు, టీడీపీ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, మండవ వెంకటేశ్వరరావు, కడియం శ్రీహరి హాజరయ్యారు. సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి, మల్లారెడ్డి, ఎంఐఎం నుంచి జాఫ్రీ, బీజేపీ నుంచి శేషగిరిరావు, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు ఈ భేటీలో పాల్గొన్నారు.



