బాలికపై ఉన్మాది దాడి : పరిస్థితి విషమం

గుంటూరు : పదేళ్ల బాలికపై ఓ ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. గుంటూరు. జిల్లా బాపట్ల మండలం వెదుళ్లపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలిక రత్నమాణిక్యాన్ని ఉన్మాది మెడ కొరికి తీవ్రంగా గాయపరిచాడు. బాలిక పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.