బిజెపిది అవగాహనా రాహిత్యం

share on facebook

గగవర్నర్‌ వ్యవస్థను రాజకీయం చేస్తున్నారు
బండి సంజయ్‌కు అవాగాహన లేదన్న గుత్తా
పికె వస్తే అంత భయమెందుకని ప్రశ్న
నల్లగొండ,మార్చి2(జనం సాక్షి): శాసనసభ సమావేశాలపై బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తున్నదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశాలకు గవర్నర్‌ను పిలవాలని చెబుతున్న బీజేపీ నాయకులు.. శాసనసభ ప్రొరోగ్‌ గురించి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. నల్లగొండలోని తన నివాసంలో జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డితో కలిసి ఆయన విూడియాతో మాట్లాడారు. బీజేపీ కుటిల యత్నాలు తిప్పికొడతామన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అవగాహనా లేమితో మాట్లాడుతు న్నారని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగం ఉండాలన్న రూలేవిూ లేదన్నారు. పలు సందర్భాల్లో ఉమ్మడి శాసనసభకు గవర్నర్‌ను పిలువకుండానే సమావేశాలు నిర్వహించారని గుర్తుచేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులనే రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని చెప్పారు. గవర్నర్‌ వ్యవస్థను కాంగ్రెస్‌, బీజేపీలు నిర్వీర్యం చేశాయని, గవర్నర్‌ పాత్రను రాజకీయంగా పరిమితం చేశాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత వారికి లేదన్నారు. రాజకీయ లబ్దికే బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలకు గవర్నర్‌కు ప్రాధాన్యత లేదని చెప్పడం బీజేపీ నాయకుల అవగాహన రాహిత్యం అన్నారు. తమిళనాడులో బీజేపీకి ఘోర పరాభవం జరిగిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆపార్టీ దేశంలో నికృష్ట విధానాలను అమలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో కేంద్రానికి ముందస్తు ఆలోచన లేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార దాహం తప్ప వేరే ఆలోచన లేదన్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ దేశవ్యాప్తంగా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారని చెప్పారు. తెలంగాణలో పీకే వ్యూహాలపై జంకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సుభిక్షమైన, సుస్థిర పరిపాలన కొనసాగితుందని చెప్పారు. ఉభయ జాతీయ పార్టీలు దేశ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. పార్టీ పరంగా ఎవరి సేవలు ఉపయోగించుకోవలనేది టీఆర్‌ఎస్‌ వ్యక్తిగత అంశమన్నారు. రష్యా` ఉక్రెయిన్‌ ల యుద్ధం నేపథ్యంలో అక్కడి భారతీయులను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు లేని నావలాగా సాగుతోంది.. ఎప్పుడు ఎటు కొట్టుకుపోతుందో వారికే తెలియదు. బీజేపీకి అభ్యర్థులు లేరు.కాంగ్రెస్‌ పార్టీలో రోజూ తన్నులాటే. 2023లో అధికారంలోకి రావడం ఖాయమని
ఎలా చెబుతారు. బీజీపీ ప్రభుత్వం గవర్నర్‌ వ్యవస్థను పార్టీలాగే వాడుకుంటుందన్నారు.. బీజేపీ ప్రతీ అంశాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందని గుత్తా సుఖేందర్‌ రెడ్డి విమర్శించారు.

Other News

Comments are closed.