బియ్యం, ఇత్యావసర సరుకులు పంపిణీ ప్రారంభించిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

share on facebook
– విప్ రేగా, రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి సహకారంతో……

బూర్గంపహాడ్ ఆగస్టు05 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్  మండల కేంద్రంలో గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు బియ్యంతో పాటుగా నిత్యవసర సరుకులను పంపిణీని జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె బూర్గంపహాడ్ గ్రామ పంచాయతీ లో ముంపు బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి, ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని గోదావరి పంపు ప్రాంత ప్రజలకు అండగా ఉంటామని అన్నారు. గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు స్థానిక శాసనసభ్యులు రేగా కాంతారావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి సహకారంతో కోటి రూపాయలతో పినపాక నియోజకవర్గం లో 13 వేల కుటుంబాలకు బియ్యంతో పాటుగా పలు రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్క బాధితుడికి బ్యాంకు ఖాతాలో 10000 రూపాయలు జమ చేయడం జరిగిందన్నారు. 2 నెలల పాటు 25 కిలోలు బియ్యం ఇవ్వడం జరుగుతుందన్నారు, వరద బాధితుల కోసం సుమారు 1000 కోట్ల రూపాయలతో ఎత్తైన ప్రదేశాలలో ప్రభుత్వం ఇల్లు నిర్మాణాలను చేపడు తుందన్నారు. భవిష్యత్తులో గోదావరి వరద ఉధృతకి గ్రామాలు మునగడం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పి ఏ సి ఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సర్పంచ్ సిరిపురపు స్వప్న, మాజీ సర్పంచ్ జక్కం సుబ్రహ్మణ్యం, టిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు గోనెల నాని, నియోజకవర్గ పరిశీలకులు సాబీర్ పాషా, బొల్లు రవి, సాదిక్, సాబీర్ పాషా, సోహెల్ పాషా వార్డు సభ్యులు సౌకత్, సంపత్, తోకల సతీష్, గంగరాజు యాదవ్,చెన్నం రవి, కన్నేపళ్లి సతీశ్, మందా ప్రసాద్, కేసూపాక మహేష్, షబాజ్, రాగవులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

 
Attachments area

Other News

Comments are closed.