బీఎన్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

చిత్తూరు: చిత్తూరు బీఎన్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సర్క్యూట్‌ బోర్టు, స్టోర్‌ రూమ్‌ తీగలు  దగ్థమయి భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.