బీమారంగంలో ఎఫ్‌డీఐలను స్వాగతిస్తాం
ముంబయి: రాబోవు కాలంలో భీమా రంగం అభివృద్దికి పెట్టుబడులు చాలా అవసరమని, అందుకే ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను తాము స్వాగతిస్తున్నామని ఐఆర్‌డీఏ ఛైర్మన్ జె. హరినారాయణ అన్నారు. ముంబయిలో జరుగుతన్న అసోచామ్ సదస్సుకు హాజరైన సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీమారంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపును తాము స్వాగతిస్తామన్నారు. ఇప్పటి వరకూ ఈ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి 26 శాతం మాత్రమే ఉంది.



