బీమా రంగంలోనూ త్వరలోనే సంస్కరణల అమలు : జె.హరినారాయణ

హైదరాబాద్‌: బీమా రంగంలో నూతన సంస్కరణలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ జె. హరినారాయణ స్పష్టంచేశారు. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయి మార్గదర్శకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాదులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలతో పోలీస్తే ప్రస్తుతం భారత బీమా రంగం వృద్ధిలోకి వచ్చిందని ఆయన చెప్పారు.జీవిత బీమా రంగానికి దీటుగా నాస్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వాటాని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు  తెలిపారు. బీమా రంగంలో కొనసాగిస్తున్న పాత పాలసీలకు బదులుగా పరిస్థితులకు తగ్గట్లు నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు హరినారాయణ చెప్పారు.