బీసీ అజెండాతో ఢిల్లీ చేరిన చంద్రబాబు

ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల్లో ఎక్కువసీట్లు తదితర అంశాలపై ఇతర జాతీయపార్టీల మద్దతు కూడగొట్టేందుకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. తెదేపా ఎంపీలతో కలిసి ఆయన ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు దేవెగౌడ, 5.30 గంటలకు శరద్‌యాదవ్‌తో 6.15 గంటలకు ములాయసింగ్‌,7.15 గంటలకు సురవరం, బర్దన్‌లతో ఆయన భేటీ అవుతారు.