బీహార్‌కు ప్రత్యేక హోదా కోరుతూ జేడీయూ తీర్మానం

ఢిల్లీ : ఢిల్లీ రాంలీలా మైదానంలో అధికార& ర్యాలీ పేరుతో జేడీయూ భారీ బహిరంగ సభ నిర్వహించింది. సభలో బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ మాట్లాడుతూ… అభివృద్ధి సూచీలో జాతీయ సగటు కంటే బీహార్‌ వెనుకబడి ఉందన్నారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఈ సందర్భంగా తీర్మానించారు. బహిరంగ సభకు అధిక సంఖ్యల బీహారీలు తరలివచ్చారు.