బీహార్‌ సీఎం నితిశ్‌కుమార్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు

వాషింగ్టన్‌: బీహార్‌ ముఖ్యమంత్రి నితిశ్‌కుమార్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ స్థానం లభించింది. బీహార్‌ ఆర్ధిక స్థితిగతులను మార్చిన నితిశ్‌కు ప్రతిష్టాత్మక ఫారెన్‌ పాలసీ మ్యాగ్త్జెన్‌ టాప్‌ 100 గ్లోబల్‌ ధింకర్స్‌ లిస్టులో చోటు దక్కింది. జాబితాలో మయన్మార్‌లో ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్‌సాన్‌సూకీకి ప్రధం స్థానం లభించింది. భారత్‌లో పేద రాష్ట్రమైన బీహార్‌ను అభివృద్ధి పధంలో నడిపించినందుకు నితీశ్‌కు ఈ జాబితాలో 77వ స్థానం దక్కింది. పాక్‌లో తాలిబన్‌ దాడుల్లో గాయపడిన బాలల హక్కుల కార్యకర్త యూసఫ్‌ మలాలా ఆరో స్థానంలో ఉండగా.. ఆమెరికా అధ్యక్షుడు ఒబామా ఏడో స్థానం సంపాదించుకున్నారు.