* బీహార్ పర్యటనలో కేసీఆర్ వెంట రవీందర్ సింగ్

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లారు. అతని వెంట కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ను వెంట తీసుకుని వెళ్లారు. దేశం కోసం గాల్వన్ ఘటనలో అమరులైనా కుటుంబాలకు ధైర్యం కల్పించాలని పర్యటన ముఖ్య ఉద్దేశం.
సికింద్రాబాద్ లో ప్రాణాలు కోల్పోయిన వలస కూలీల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి ముఖ్యమంత్రి బీహార్ పర్యటనకు వెళ్లారు. మంగళవారం
వినాయక చవితి పండుగ ఏర్పాట్లలో బిజీగా ఉన్న సర్దార్ రవీందర్ సింగ్ కు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఫోన్ చేసి సాయంత్రానికి ప్రగతి భవన్ కు చేరుకోవాలని సూచించారు. దీంతో హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ కు వెళ్లారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీహార్ పర్యటనలో మీ భాగస్వామ్యం అవసరమని సి ఎం ఓ ఆఫీస్ తెలిపింది. దీంతో బుధవారం కేసీఆర్ వెంట ప్రయాణమయ్యారు.