బెల్లంపల్లిలో యువతి మృతి

ఆదిలాబాద్‌: బెల్లంపల్లిలో అంజలి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అంజలి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలే అంజలి  కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.