బైక్ చోరీలకు పాల్పడుతున్న హోంగార్డు అరెస్ట్…
హైదరాబాద్: బైక్ చోరీలకు పాల్పడుతున్న హోంగార్డు తో పాటు మరో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి దొంగిలించిన 38 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా మెట్ పల్లిలో హోంగార్డు(భిక్షపతి)గా పనిచేస్తున్నట్లు సమాచారం.


