బొగ్గు కుంభకోణంలో నన్ను ప్రశ్నించలేదు:దాసరి నారాయణరావు
హైదరాబాద్: బొగ్గు కుంభకోణంలో సీబీఐ అధికారులు తనను ప్రశ్నించలేదని తనకు సంబంధించిన సంస్థలు, కార్యాలయాల్లో సోదాలు జరగలేదని దాసరి నారాయణరావు తెలిపారు. బొగ్గుగనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో ఆ శాఖలో సహాయమంత్రిగా పనిచేసిన దాసరి నారాయణరావు ఇంటిపై సీబీఐ దాడులు జరిగాయని వార్తలు రావటంతో ఆయన ఈమేరకు ప్రకటన చేశారు.


